Saturday, September 21, 2024
Homeజనరల్ న్యూస్న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌‌లో సీఎం రేవంత్

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌‌లో సీఎం రేవంత్

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌‌లో సీఎం రేవంత్

స్పాట్ వాయిస్ , బ్యూరో : తెలంగాణ సీఎం రేవంత్ పై తమకున్న అభిమానాన్ని ఎన్ ఆర్ ఐ లు చాటుకున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన కొనసాగుతున్నది. సీఎం అమెరికా పర్యటన సందర్భంగా ఆయన అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ స్ట్రీట్ లో రేవంత్ రెడ్డి ఫొటోలను ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ లోనూ ఇదే తరహా టైమ్ స్క్వేర్ తరహాలో టి స్క్వేర్ మల్టీపర్పస్ హబ్ ను నెలకొల్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని రాయదుర్గంలో నిర్మించేందుకు ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. ఈ హబ్ నిర్మాణంలో హైదరాబాద్ కు గ్లోబల్ వైడ్ గా మరో గౌరవం దక్కనుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments