Saturday, November 23, 2024
Homeజిల్లా వార్తలుస్నేహం లేనివాడే పేదోడు..

స్నేహం లేనివాడే పేదోడు..

స్నేహం లేనివాడే పేదోడు..

కేయూ పాల‌క‌మండ‌లి స‌భ్యురాలు డాక్ట‌ర్ అనితారెడ్డి 

ఆనందనిలయం లో స్నేహితుల దినోత్స‌వం.. 

 

స్పాట్ వాయిస్‌, బాల‌స‌ముద్రం: అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి స్నేహితుల దినోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించారు. హన్మకొండ బాలసముద్రం లోని ఆనంద నిలయం అనాథ‌ బాలికల ఆశ్రమంలో పిల్లలకు ఫ్రెండ్ షిప్ బాండ్ల ను కట్టి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఎవ‌రూ లేర‌న్న భావ‌న క‌లుగ‌కుండా అన్నీ పండుగ‌లు జ‌రుపుతామ‌ని అనితా రెడ్డి అన్నారు. ఈ సంద‌ర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ స్నేహమంటే మనసులో పుట్టి మట్టిలో కలిసిపోయేదని, స్నేహం చేయడానికి తొందరపడవద్దు.. ఒక్క‌సారి చేశాక ఎప్పటికి వదలొద్దు అన్నారు. జీవితంలో తల్లిదండ్రులని, తోబుట్టువులని బంధువుల్ని ఎంచుకోలేముగానీ స్నేహం మ‌న ఎంపికే అన్నారు. ఆనందంలో తోడున్నా లేకపోయినా ఎదురయ్యే ఆపదలో మేమున్నాం అని చెప్పేది స్నేహితులు ఒక్క‌రే అన్నారు. అంతా క‌లిసి మెలిసి ఉండాల‌ని, డ‌బ్బులేని వాడు పేద‌వాడు కాద‌ని, నిజ‌మైన స్నేహం లేనివాడే పేదోడ‌ని అనితారెడ్డి అన్నారు. అనంత‌రం పిల్ల‌లంద‌రికీ మిఠాయిలు పంచి సంబురం జ‌రుపుకున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments