Tuesday, December 3, 2024
Homeకెరీర్ఏఏ ఉద్యోగాలు.. ఎప్పుడు భర్తీ..

ఏఏ ఉద్యోగాలు.. ఎప్పుడు భర్తీ..

ఏఏ ఉద్యోగాలు.. ఎప్పుడు భర్తీ..

జాబ్ క్యాలెండర్ వివరాలు మీ కోసం..

స్పాట్ వాయిస్, బ్యూరో: కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల కోసం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది. ఏఏ ఉద్యోగాలు, ఎప్పుడు భర్తీ చేయాలనే వివరాలను క్యాలెండర్లో పొందుపరిచింది. ఏ ఉద్యోగాలకు, ఎప్పుడు నోటిఫికేషన్‌ ఇస్తారు. ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారు. ఏ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఆయా ఉద్యోగాలకు అర్హతలతో క్యాలెండర్‌ విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం.. స్పాట్ వాయిస్ లో..

 

*ఈ ఏడాది అక్టోబర్‌లో మరోసారి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌..

*2025 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్‌

*2025 జూలైలో గ్రూప్‌-1 మెయిన్స్‌ను

*వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూపు-2 నోటిఫికేషన్

*అక్టోబర్‌లో పరీక్షలు

*వచ్చే ఏడాది జూలైలో గ్రూప్‌-3 నోటిఫికేషన్

*నవంబర్‌లో పరీక్షలు

*వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్‌లో పరీక్షలు

*ట్రాన్స్‌కోలో వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి అక్టోబర్‌లో నోటిఫికేషన్, వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్ష

*వివిధ శాఖల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్.., వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు

*వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్.., ఏప్రిల్‌లో పరీక్షలు

*ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్, మేనెలలో పరీక్షలు

*ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్-ఆగస్టులో పరీక్షలు

*డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్‌లో నోటిఫికేషన్-సెప్టెంబర్‌లో పరీక్షలు

*నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్-ఏడాది జనవరిలో పరీక్షలు

*వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ -ఏప్రిల్‌లో పరీక్షలు

*ప్రతి ఏడాది రెండుసార్లు టెట్‌ నిర్వహణ

*2025 ఏప్రిల్‌లో మరోసారి నోటిఫికేషన్‌ ఇచ్చి జూన్‌లో పరీక్షలు

*సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం 2025 జూలైలో నోటిఫికేషన్ -నవంబర్‌లో పరీక్షలు

*వచ్చే ఏడాది జూలైలో మరోసారి గ్రూప్‌-1 మెయిన్స్‌

Telangana Job Calendar 2024-25_Telugu

RELATED ARTICLES

Most Popular

Recent Comments