Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలువరంగల్ కలెక్టర్ పేరుతో ఫేక్ మెసేజ్‌లు

వరంగల్ కలెక్టర్ పేరుతో ఫేక్ మెసేజ్‌లు

మోసపూరితమైన మెసేజ్ లకు రెస్పాండ్ కావద్దు
వెంటనే మెసేజ్ బ్లాక్ చేయండి
కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ జిల్లా క‌లెక్టర్ సత్య శారదా పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉప‌యోగించుకుని ప‌లువురి నుంచి డ‌బ్బు వ‌సూలు చేసేందుకు సైబ‌ర్ నేర‌గాళ్లు య‌త్నిస్తున్నారు.
నేను..
కలెక్టర్ సత్య శారదా.., మీటింగ్ లో ఉన్నానని, అర్జెంట్ డ‌బ్బులు కావాలంటూ +94784977145 శ్రీలంక నంబర్‌ నుంచి ఆ సందేశం పంపుతున్నారు. డబ్బులు ఫోన్‌పే చేసి, స్ర్కీన్‌షాట్‌ షేర్‌ చేయాలని కోరాడు. ప‌లువురికి మేసేజ్‌లు పంపించారు. దీన్ని గ‌మ‌నించిన క‌లెక్టర్ సత్య శారదా త‌క్షణ‌మే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న అస‌లు ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా అంద‌రిని అప్రమ‌త్తం చేశారు. త‌న పేరుతో ఎవ‌రూ డ‌బ్బులు అడిగిన ఇవ్వొద్దని క‌లెక్టర్ సూచించారు. పై నంబర్ మోసపూరితమైనది, దయచేసి జవాబు ఇవ్వొద్దని, వీలైనంత త్వరగా బ్లాక్ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారదా కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments