అసెంబ్లీ ఆవరణ వేదికగా ప్రారంభించనున్న సీఎం
స్పాట్ వాయిస్, బ్యూరో: రెండో విడుత రుణమాఫీకి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని విడుతల వారీగా పూర్తి చేస్తోంది. ఈనెల 18న తొలి విడత రూ. లక్షలోపు రుణాలు తీసుకున్న వారి ఖాతాల్లోకి నిధులు జమ చేశారు. తొలి విడతలో దాదాపు 11 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు 6 వేల కోట్ల నిధులు జమ చేశారు. ఇక రెండు విడతల్లో లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. మంగళవారం నుంచి రెండో విడత రైతు రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రెండో విడతలో లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేయనున్నట్లు వెల్లడించింది. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి రైతుల అకౌంట్లలోకి నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం రైతు రుణమాఫీపై అసెంబ్లీలో చర్చ పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. రెండో విడుత నిధుల విడుదల తర్వాత అసెంబ్లీ స్పీకర్‌కు చర్చకు సంబంధించిన తీర్మానాన్ని ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆగస్టు 15లోపు మూడో విడతలో రూ. 2 లక్షల రుణమాఫీ చేయనున్నారు. మూడో విడతగా రూ.లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు రుణాలు తీసుకున్నవారికి లబ్ధి చేకూరనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన తిరిగి వచ్చిన వెంటనే మూడో విడుత రుణాలు మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
రేపే రెండో విడుత రుణమాఫీ..!
RELATED ARTICLES
Recent Comments