ఇది గోదావరి ప్రస్తుత పరిస్థితి..
స్పాట్ వాయిస్, బ్యూరో: గోదారమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద 53 అడుగులతో ఉగ్ర రూపం దాల్చింది. ఇవి నిజమే కానీ..ఉత్తర తెలంగాణ మీదుగా ప్రవహించే గోదావరి పాయలా పారుతోంది. వరద నీరు లేక.. ప్రాజెక్టులు నిండగా.. గోదారమ్మ.. కింది పరుగులు తీయడం లేదు. కేవలం.. కాళేశ్వరం త్రివేణి సంగమం నుంచే గోదావరి నీటి పరుగులు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్‌లో పుట్టిన గోదావరి నది మొత్తం 1,400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మన రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద గోదావరి ప్రవేశిస్తుంది. కందకుర్తి నుంచి నేరుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.. అక్కడి నుంచి కడెం ప్రాజెక్టు మీదుగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వైపు గోదావరి నది ప్రవహిస్తుంది. అయితే మహారాష్ట్ర నుంచి పెద్దగా వరద రాకపోవడంతో, బాబ్లీ ప్రాజెక్ట్ నిండకపోవడంతో.. ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నీరు లేక బోసిపోతున్నాయి. వారంరోజులుగా కడెం నుంచి వచ్చే ప్రవాహంతో పాటు పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నీటితో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే జలకళను సంతరించుకుంటోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం జలాలపై ఆధారపడిన మధ్యమానేరు, దిగువమానేరుకు ఇన్‌ఫ్లో అంతంత మాత్రంగానే ఉంది.
ఒకవైపు ఉగ్రరూపం.. మరోవైపు పాయలా..
RELATED ARTICLES
Recent Comments