ఇండ్ల లోకి చేరిన వర్షం నీరు
స్పాట్ వాయిస్ కమలాపూర్: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. కమలాపూర్ మండలం శ్రీరాముల పల్లి గ్రామంలో మురికి కాలువల నిర్మాణం సరిగా లేకపోవడంతో వర్షం నీరు అంతా ఇoడ్ల లోకి చేరడంతో ఏం చేయాలో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో బాధితులు కన్నీరు పెట్టుుకున్నారు. అధికారులు స్పందించి వెంటనే వర్షం నీరు చేరిన బాధితులని పునరావాస కేంద్రాలకు తరలించి తగు సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
Recent Comments