స్పాట్ వాయిస్, ములుగు: మేడారం సమ్మక్క ఆలయ ప్రధాన పూజారి మల్లేల ముత్తయ్య(50) శనివారం ఉదయం మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ముత్తయ్య శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఇంట్లోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ముత్తయ్య మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ముత్తయ్యకు భార్య నాగమ్మతో పాటు కూతురు సాయి ప్రసన్న, కుమారుడు సాయికుమార్ ఉన్నారు. మేడారం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Recent Comments