Sunday, November 17, 2024
Homeజిల్లా వార్తలునకిలీ పోలీసు దొంగల అరెస్టు..

నకిలీ పోలీసు దొంగల అరెస్టు..

నకిలీ పోలీసు దొంగల అరెస్టు

స్పాట్ వాయిస్ దామెర: పోలీసులమంటూ బెదిరించి చోరీకి పాల్పడిన ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు పరకాల రూరల్ ఇన్చార్జి సీఐ క్రాంతి కుమార్ తెలిపారు. బుధవారం దామెర పోలీస్ స్టేషన్ లో నిందితుల అరెస్టు చూపి, వివరాలను వెల్లడించారు. ఇన్చార్జి సీఐ క్రాంతి కుమార్, దామెర ఎస్సై కొంక అశోక్ దామెర క్రాస్ రోడ్డు లోని జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో.. గుడెప్పాడ్ నుంచి హనుమకొండ కు వెళ్తున్న ఓ కారు పోలీసులను చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, వారిని గుర్తించిన పోలీసులు వెంటనే కారును నిలిపివేసి విచారించారు. విచారణలో వారు హనుమకొండ కు చెందిన 1) ఒర్సు గణేష్ 2) వల్లేపు రాజు 3) ఓర్సు చిరంజీవి, 4) అలకుంట నరేష్ అని తెలిపారు. 15వ తేది సోమవారం రాత్రి మద్యం కోసం డబ్బులు లేకపోవడంతో రహదారిపై వెళ్తున్న వారి వద్ద నుంచి డబ్బులు చోరీ చేద్దామనే ఆలోచనతో, నడికూడ మండలం రామకృష్ణాపూర్ శివారులో వస్తున్న కారును ఆపారన్నారు. తాము పోలీసులమంటూ కారులో నుంచి వారిని దింపి, కర్రలతో దాడి చేసి వారి వద్ద నుంచి సెల్ ఫోన్ లు, డబ్బు లతో పాటు, కారును తీసుకొని వెళ్ళారు. అక్కడినుంచి వెళ్తూ కంఠాత్మకూరు సెంటర్ లోకి రాగానే అక్కడే ఉన్న భారీ కెడ్లను ఢీకొంది. అక్కడే ఉన్న స్థానికులు వారి వద్దకు రాగా, వారిని దుర్భాషలాడడంతో స్థానికులకు, వీరికి మధ్య తోపులాట జరిగింది.దీంతో దొంగిలించిన కారును అక్కడే వదిలేసి, తాము తీసుకు వచ్చుకున్న కారులో అక్కడినుంచి తప్పించుకొని వెళ్ళారు. బుధ, గురు వారాలు పరకాల లో ఉండి, హనుమకొండ కు వెళ్తున్న క్రమంలో వీరిని పట్టుకోవడం జరిగిందన్నారు. వీరి నుంచి 2 కర్రలు, 6 సెల్ ఫోన్ లు, ఒక కారు ను స్వాదీనం చేసుకున్నామన్నారు. వీరిని వెంటనే అరెస్టు చేసి పరకాల కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. కేసు చేదనలో ప్రతిభ కనబరిచిన ఎస్సై కొంక అశోక్ ను, సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments