రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలి
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
స్పాట్ వాయిస్, హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. బుధవారం హనుమకొండ రాంనగర్ లోని సీపీఎం జిల్లా కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాదారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలుకు పూనుకున్నందుకు సంతోషం వ్యక్తo చేస్తున్నామని, కానీ ప్రకటించిన విధివిధానాల్లో చాలా లోపాలు ఉన్నాయన్నారు. కౌలు రైతులను, రైతు మిత్ర బృందం లను విస్మరించారని, వారికి కూడా రుణమాఫీ అమలు చేయాలని అన్నారు. రీ షెడ్యూల్ చేసిన రుణాలకి వర్తింపజేయాలని, కుంటి సాకులతో కొంతమందిని మినహాయించాలని చూడరాదన్నారు. పాసు పుస్తకాలు లేకపోయినా, పహానిలో పేరున్న రైతులకు కూడా రుణమాఫీని వర్తింప చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, ఏటూరునాగారం ప్రాంతాల్లో ఇలాంటి గిరిజన రైతులు ఎక్కువగా ఉన్నారన్నారు. జనగణన, కుల గణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, బీసీ లకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని దానిలో వివాదం వుంది కాబట్టి కులగనణ వెంటనే చేయాలన్నారు. కోర్టు తీర్పు పేరుతో వరంగల్ మున్సిపల్ అధికారులు చెరువులను ఆక్రమించారని, పేదల గుడిసెలను వారంలో తొలగిస్తామని చెబుతున్నారని, ఇది అన్యాయం అన్నారు. హనుమకొండ బంధం చెరువులో ఎక్స్ సర్వీస్ మెన్ ప్రభుత్వ ఆఫీసులు, స్వాతంత్ర సమరయోధులు, కొంతమంది విలేకరులకు చెరువు శిఖములోనే పట్టాలు ఇచ్చారని , కానీ పేదలు ఇండ్లను కూల్చేస్తామన్నారని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వాసుదేవ రెడ్డి, జి ప్రభాకర్ రెడ్డి, యం.చుక్కయ్య జిల్లా కమిటీ సభ్యులు రాగుల రమేష్, కే . లింగయ్య, ఎల్.దీప,దొగ్గెల తిరుపతి, జి రాములు పాల్గొన్నారు
Recent Comments