కాళేశ్వరంలో తొలి ఏకాదశి పూజలు
భారీగా తరలివచ్చిన భక్తులు
స్పాట్ వాయిస్, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం లో బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా తెలంగాణ మహారాష్ట్ర చత్తీస్ ఘ డ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరి ప్రధాన పుష్కర ఘాట్ వద్ద భక్తులు త్రివేణి సంగమంలో తొలి ఏకాదశి స్నానాలు ఆచరించి, గోదావరినది లో దీపాలు వదిలారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అనుబంధ దేవాలయమైన శుభానందా దేవి ఆలయంలో కుంకుమార్చనలు చేశారు.
Recent Comments