సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
స్పాట్ వాయిస్, బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం చెప్పారు. ఆస్పత్రుల్లోని ప్రతీ బెడ్‌కు ఒక నంబరు కేటాయించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఎక్కువ పారితోషికం ఇచ్చి ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఆరోగ్య శ్రీకి, రేషన్ కార్డుకు లింకు పెట్టొద్దు..
RELATED ARTICLES
Recent Comments