Thursday, May 22, 2025
Homeలేటెస్ట్ న్యూస్హస్తంగూటికి మరో ఎమ్మెల్యే..

హస్తంగూటికి మరో ఎమ్మెల్యే..

బీఆర్ఎస్ కు చెమటలు పట్టిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్
స్పాట్ వాయిస్, బ్యూరో: కాంగ్రెస్​లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల నుంచి కాలె యాదయ్య రేవంత్ టీమ్​లో చేరగా, తాజాగా మరో ఎమ్మెల్యే హస్తం గూటికి చేరారు. శుక్రవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులూ కాంగ్రెస్‌లో చేరారు. ప్రకాశ్ గౌడ్ బీఆర్​ఎస్​ను వీడతారంటూ గతంలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా స్థానికంగా వచ్చిన వ్యతిరేకం కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరికి శుక్రవారం రాత్రి కాంగ్రెస్ లో చేరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments