Monday, November 25, 2024
Homeక్రైమ్అర్ధరాత్రి దారుణ హత్య..

అర్ధరాత్రి దారుణ హత్య..

అర్ధరాత్రి దారుణ హత్య..

భార్య భర్తలు మృతి 

వరంగల్ జిల్లాలో ఘటన..

స్పాట్ వాయిస్, క్రైమ్: వరంగల్ జిల్లా నర్సంపేటలోని చెన్నారావుపేట 16 చింతల్ తండాలో దారుణం చోటు చేసుకుంది. మేకల బన్ని అనే యువకుడు తన భార్య దీపిక కుటుంబంపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడి ఘటనలో దీపిక కుటుంబ సభ్యులు బానోతు శ్రీనివాస్, సుగుణ అక్కడికక్కడే మృతి చెందారు. బానోత్ మదన్, దీపికకు గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. దీపికను మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన బన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్ద మనుషుల పంచాయతీ తర్వాత దీపికను తల్లిదండ్రులు తీసుకెళ్లారు. దీంతో అగ్రహించిన బన్ని కత్తితో దాడికి తెగబడ్డాడు. పోలీసులు నిదితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 

 

ప్రేమించిన అమ్మాయి కుటుంబంపై విశిక్షణ రహితంగా తల్వార్ దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా చంద్రరావు పేట మండలం 16చింతల తండాలో చోటుచేసుకుంది.

 

నాగరాజు 16 చింతల తండా దీపిక ప్రేమించుకున్నారు.. మూడు నెలలు సహజీవనం కూడా చేశారు..

ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కాంప్రమైజ్ అయి ఎవరింటికి వారు వెళ్లిపోయారు..ఇద్దరినీ విడదీశారని కోపంతో నాగరాజు(బన్నీ ) ఆ కుటుంబం పై కక్షపెచ్చుకున్నాడు

 

అర్ధరాత్రి 1:35 నిమిషాల సమయంలో మంచం లో బయట నిద్రిస్తున్న కుటుంబం పై తల్వార్ తో విచక్షణ రహితంగా దాడి చేశాడు .

 

ఈ దాడిలో అమ్మాయి తల్లి బానోతు సుగుణ 40 అక్కడికక్కడే మృతి చెందారు .

 

తండ్రి బానోతు శ్రీనివాస్ (45) నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు.

 

దీపిక( 21)కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి ,

 

తమ్ముడి మదన్ (18) కి తీవ్ర గాయాలు కాగా వీరిద్దరూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

నర్సంపేటకు చెందిన 108 అంబులెన్స్ ఈ ఎన్ టి కర్ణాకర్, పైలెట్ అజీజ్ మీయా సహకారంతో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments