ఎస్సై మృతదేహంతో రాస్తారోకో
కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది
స్పాట్ వాయిస్ నర్సంపేట, నల్లబెల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ ఇటీవల మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో ఆత్మ హత్యాయత్నం చేసుకున్న విషయం విధితమే. హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం మృతి చెందారు. సీఐ, స్టేషన్ సిబ్బంది వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఎస్సై భార్య ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లో అధికారులు జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఎస్సై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆయన స్వగ్రామం నల్లబెల్లి మండలం నారక్కపేట 365 జాతీయ రహదారిపై ఎస్సై శ్రీనివాస్ మృతదేహంతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి
రాస్తారోకో లో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొని ఎస్సై శ్రీనివాస్ మృతికి కారణమైన వారిని విధుల నుండి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులతో మృతి చెందిన అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ తీవ్ర పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేకనే ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందాడని దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ఎస్సై శ్రీనివాస్ కుటుంబానికి కోటి రూపాయలు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎస్సై కుటుంబానికి న్యాయం చేయాలని వారి కుటుంబ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సై మృతికి గల కారణాలపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను గుర్తించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయన కుటుంబానికి న్యాయం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.
Recent Comments