కాంగ్రెస్ నాయకులకు మాజీ ఎమ్మెల్యే పెద్ది వార్నింగ్
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని, తమ పార్టీ ఆఫీసు జోలికి రావొద్దని, టార్గెట్ కావొద్దని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సూచించారు.బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీభవన్ కానీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ ఇతర పార్టీల కార్యాలయాలకు భూమిని కేసీఆర్ రాకముందే కేటాయించారని అన్నారు. ఖాదీ బోర్డు కు కేటాయించిన భూమి కూడా ప్రభుత్వ భూమి అని అన్నారు. పార్టీ కార్యాలయంలో ఇటుక పెళ్లను కదిపినా, గాంధీభవన్ కూలుతుందని హెచ్చరించారు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి జీవోను అప్పుడున్న నామినల్ రేట్ ప్రకారం ఇవ్వడం జరిగిందని,ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బోయినపల్లి మెయిన్ రోడ్ లో 10 ఎకరాల భూమిని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ కు కేటాయించారని,అది కూడా అదే జీవోను అనుసరించి కేటాయించారని అన్నారు. తను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇప్పుడున్న నాయకులు చాలామంది లేరని, జిల్లా పార్టీ కార్యాలయం కూడా మున్సిపాలిటీ కి చెందిన భూమిలోనే దగ్గరుండి కట్టించామని గుర్తు చేశారు. జీవోలను అనుసరించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయాలకు భూమిలను కేటాయించారని, వాటి జోలికి వస్తే జాగ్రత్త అని హెచ్చరించారు. పార్టీ కార్యాలయాలను టచ్ చేస్తే, మీ పార్టీ కార్యాలయాలను కూడా టచ్ చేయాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆంధ్ర బ్యాంకుకు ఏ విధంగా కిరాయికి ఇస్తారో చెప్పాలన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా ఆఫీసును పెళ్లిళ్లకు కిరాయి కి ఇస్తున్నారని, ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కమర్షియల్ గా వాడుకుంటున్నారని అన్నారు. ఇంకా ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూడా ఇదేవిధంగా వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అనంతరం దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, కార్పొరేటర్లు చెన్నం మధు, బోయిన్న్ పల్లి రంజిత్ రావు, నల్ల స్వరూపారాణి, ఇమ్మడి లోహిత రాజు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జానకీరాములు, నార్ల గిరి రమేష్, నయీముద్దీన్, ఉడుతల సారంగ పాణి, కుసుమ లక్ష్మీనారాయణ, బండి రజిని కుమార్, పరశురామ్, యాదగిరి, పోలేపల్లి రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments