Friday, September 20, 2024
Homeజాతీయంరేపు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్

రేపు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్

పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: తెలంగాణలో రేపు పాఠశాలలు, కళాశాలలకు బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి. నీట్ పరీక్షలపై సమగ్ర విచారణను జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఈ బంద్ కు పిలుపు నిచ్చాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, పీడీఎస్‌ఓ, ఎన్‌ఎస్‌‍‍యూఐ విద్యార్థి సంఘాలు ఈ బంద్ కు పిలుపు నిచ్చాయి. దేశ వ్యాప్తంగా… జులై నాలుగో తేదీన దేశ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు బంద్ కు పిలునిచ్చిన నేపథ్యంలో తెలంగాణలోనూ ఈ బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లు, కళాశాలలు రేపు స్వచ్ఛందంగా మూసి వేయాలని విద్యార్థి సంఘ నేతలు కోరారు. అసమర్థంగా పరీక్షలు నిర్వహిస్తున్న ఎన్‌టీఏను రద్దు చేయాలని ఈ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments