Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్సీఎంఆర్ఎఫ్ కు ఆన్ లైన్ దరఖాస్తు..

సీఎంఆర్ఎఫ్ కు ఆన్ లైన్ దరఖాస్తు..

ఇక cmrf.telangana.gov.inలోనే..
15వ తేదీ నుంచి సర్వీస్..
స్పాట్ వాయిస్, బ్యూరో: ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఇకపై ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. ఈ సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెంటర్ ఫర్‌గుడ్ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో వెబ్‌సైట్ ను రూపొందించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ వెబ్‌సైట్‌ని ప్రారంభించారు. ఇకపై సీఎం సహాయ నిధి దరఖాస్తులను వెబ్‌సైట్‌లోనే పూరించాల్సి ఉంటుంది. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫారు లేఖను జతచేసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్‌లో సంబంధింత దరఖాస్తుదారుల బ్యాంక్‌ అకౌంట్ నంబర్‌ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్‌లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్‌కు సంబంధించిన ఒక కోడ్‌ని ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్‌ను సంబంధిత ఆసుపత్రులకు పంపి నిర్ధారించుకుంటారు. వివరాలు అన్ని సరిగా ఉంటే అప్లికేషన్‌ను ఆమోదించి చెక్‌ సిద్ధం చేస్తారు. చెక్‌పై తప్పనిసరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్‌ను ప్రింట్ చేస్తారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్‌లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ఈ నెల 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. సీఎంఆర్‌ఎఫ్‌ కోసం cmrf.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments