ములుగు జిల్లా పేరు మార్పు..
నేటి నుంచి అభిప్రాయ సేకరణ..
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టేందుకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రతిపాదన మేరకు ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకోగా.. మంగళవారం జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ప్రతి పంచాయతీ పరిధిలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించి, పేరు మార్చే విషయంపై గ్రామ సభల్లో చర్చించనున్నారు. ఈ మేరకు ఎక్కడికక్కడ గ్రామ సభలు నిర్వహించాల్సిందిగా జిల్లా పంచాయతీ అధికారి ద్వారా మండల స్థాయి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
2019లో జిల్లాగా..
ములుగును 2019 ఫిబ్రవరి 16న అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. ములుగు అంతకుముందు వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉండగా.. తొమ్మిది మండలాలు, దాదాపు 3 లక్షల జనాభాతో ములుగు జిల్లా ఏర్పాటైంది.
Recent Comments