29న కొండగట్టుకు పవన్ కల్యాణ్
స్పాట్ వాయిస్, బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 29న ఆయన కొండగట్టుకు రానున్నారు. శనివారం ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. 11 రోజుల పాటు కొనసాగనున్న ఈ దీక్షలో భాగంగా ఆయన కేవలం పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకోనున్నారు. వారాహి దీక్షలో భాగంగానే పవన్ కల్యాణ్ తమ ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారానికి ముందు కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చారు. తన ఎన్నికల ప్రచార రథమైన వారాహికి ఇక్కడే పూజలు చేయించారు. అనంతరం తన వారాహి విజయ యాత్రను కొనసాగించారు.
Recent Comments