Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్28న వరంగల్‌కు సీఎం రేవంత్..!

28న వరంగల్‌కు సీఎం రేవంత్..!

స్పాట్ వాయిస్, బ్యూరో: వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 28న పర్యటించనున్నారు. నగరం అభివృద్ధిపై సీఎం దృష్టి సారించనున్నారు. అభివృద్ధి పనులపై ఈనెల 28న హన్మకొండ కలెక్టరేట్‌లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. కుడా పరిధిలో చేపట్టబోయే అండర్ డ్రైనేజీ పనులతో పాటు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వరంగల్‌లోనే సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments