ప్రభుత్వానికి నష్టం రూ. 39 కోట్లు..
స్పాట్ వాయిస్, బ్యూరో: మైనింగ్ పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, ఆఫీసులపై మనీలాండరింగ్, హవాలా అనుమానాల నేపథ్యంలో ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. సోదాలు పూర్తి కావడంతో ఈడీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మైనింగ్ పేరుతో ఎమ్మెల్యే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, రూ.300 కోట్లమేర అక్రమాలు జరిగాయని తెలిపింది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.39 కోట్లు నష్టం చేకూర్చారని, బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలను గుర్తించామని పేర్కొంది. అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బుతో రియల్ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని, సోదాల సందర్భంగా రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. బినామీల పేర్లతో లావాదేవీలను గుర్తించామని, కొన్ని బ్యాంక్ లాకర్స్‌ని ఇంకా తెరవాల్సి ఉందన్నారు. మధుసూదన్ రెడ్డి, మహిపాల్‌రెడ్డికి పలువురు బినామీలుగా ఉన్నారని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది.
ఎమ్మెల్యే అక్రమాలు.. రూ.300 కోట్లు
RELATED ARTICLES
Recent Comments