Friday, September 20, 2024
Homeతెలంగాణఒకేసారి రుణ మాఫీ..

ఒకేసారి రుణ మాఫీ..

ఆగస్టు 15 డెడ్ లైన్..
నిర్ణయించిన మంత్రి వర్గం..
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు రుణాల మాఫీ ప్రధానంశంగా రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం నాడు భేటీ అయ్యింది. ఇందులో రుణ మాఫీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రుణమాఫీకి కటాఫ్ తేదీని 2023 డిసెంబర్ 9వ తేదీగా మంత్రి వర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. అంతేకాదు.. రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 47 లక్షలకు పైగా మంది రైతులకు ఊరట లభించనుంది. ఎన్నికల హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో రుణామాఫీలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండటం కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ లేకపోవడంతో రుణాల మాఫీపై స్పీడ్ పెంచింది సర్కార్. ప్రధానంగా ఆగస్ట్ 15 లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన మేరకు.. ప్రభుత్వం స్పీడ్ పెంచింది. రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయాలని, అది కూడా ఆగస్ట్ 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments