ఎస్సై చేసిన పనిపై రేవంత్ సర్కార్ సీరియస్..
స్పాట్ వాయిస్, క్రైం:యశంకర్ భూపాలపల్లి కాటారం పోలీస్ డివిజన్ లోని కాళేశ్వరం ఎస్సై భవనీ సేన్ పై ప్రభుత్వం సీరియస్ అయింది. ఎస్సైని డిస్మస్ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్సై భవనీ సేన్ ను సర్వీస్ నుంచి తొలగించింది. ఎస్సై భవాని సేన్ స్టేషన్ లో పని చేసే మహిళ కానిస్టేబుల్ ను బెదిరింపులకు గురి చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు ఉన్నతాధికారులను ఆశ్రయించగా.. విచారణ జరిపారు. విచారణలో ముగ్గురు మహిళ కానిస్టేబుళ్లను వేధించినట్టు నిర్దారణ అయింది. దీంతో ఎస్సైపై లైంగిక వేధింపులు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎస్సై సర్వీస్ రివాల్వర్ డీఎస్పీ స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో సస్పెన్షన్ కు గురయ్యాడు. అయితే పోలీస్ శాఖకే మచ్చతెచ్చే పనులు చేస్తున్న ఎస్సైపై ప్రభుత్వం వేగంగా స్పందించింది. అతడిని సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాళేశ్వరం ఎస్సైని సర్వీస్ నుంచి రిమూవ్ చేసి సర్కార్
RELATED ARTICLES
Recent Comments