ఎవరికి ఏ శాఖ అంటే..?
స్పాట్ వాయిస్, బ్యూరో: దేశంలో బీజేపీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తరవాత మొదటిసారి మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న కిషన్‌రెడ్డికి బొగ్గు గనులశాఖ, బండి సంజయ్‌కు హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారు. కేంద్ర హోంశాఖ మళ్లీ అమిత్ షాను కేటాయించింది. రక్షణశాఖను రాజ్‌నాథ్ సింగ్‌కు కేటాయించింది. నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖలోనే కొనసాగించేలా నిర్ణయాలు తీసుకుంది. చాలా వరకు సీనియర్ నేతలకు పాత శాఖలను ప్రధాని నరేంద్ర మోడీ కేటాయించారు. కీలక శాఖలన్నీ బీజేపీ నేతలకే అప్పగించింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తరవాత ఈ విషయంలో తొలి సంతకాన్ని పెట్టారు. పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలో రూ.9.3 కోట్ల మంది రైతులకు రూ.2వేలు చొప్పున రూ.20వేల కోట్ల నిధులు వారి ఖాతాల్లో జమకానున్నాయి.
Recent Comments