Friday, November 22, 2024
Homeతెలంగాణఇయ్యాల రేపు..లెక్కింపే

ఇయ్యాల రేపు..లెక్కింపే

ఇయ్యాల రేపు..లెక్కింపే

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలకు రెండురోజులు

మొదలైన మండలి ఉప ఎన్నిక కౌంటింగ్..

మధ్యాహ్నం వరకు బండిల్స్ కట్టే పని..

రేపు మధ్యాహ్నం తర్వాతే తేలనున్న విజయం

స్పాట్ వాయిస్, బ్యూరో:  వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు నల్లగొండ జిల్లా కేంద్రం లో బుధవారం మొదలైంది. బ్యాలెట్‌ ఓట్లు కావడంతో ఫలితం వెలువడడానికి రెండు రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. గత నెల 27వ తేదీన నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో పోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో మొత్తం 72.44 శాతం పోలింగ్‌ జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని దుప్పలపల్లి గోదాములో ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ స్టార్ట్ అయింది. మొదట బ్యాలెట్ పేపర్లను బండిల్ గా కడుతున్నారు.   మధ్యా హ్నం వరకు బండిల్స్‌ కట్టే పని పూర్తికానుంది. భోజన విరామం తరువాత ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మూడు ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్‌ స్టేషన్లలో నమోదైన ఓట్లను మూడు విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగనుంది.

ఇవ్వాల..రేపు

మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థి గెలవక పోతే రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజేతను ప్రకటిస్తారు. మొత్తం 96 టేబుళ్లపై ఓట్ల లెక్కించనున్నారు. 3,36,013 ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది.  మొదట తొలి ప్రాధాన్యం ఓట్లు లెక్కింపు చేస్తారు. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కోసం 2,800 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో 1,100మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లతో పాటు కౌంటింగ్‌ అసిస్టెంట్లు 37 మంది ఏఆర్‌వోలు, 40 మంది తహసీల్దార్లను నియమించారు. అదేవిధంగా 12 జిల్లాల నుంచి మరో 300మంది సిబ్బందిని కేటాయించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments