Friday, November 22, 2024
Homeటాప్ స్టోరీస్అరూరికి మళ్లీ దెబ్బెసిన వర్ధన్నపేట..!

అరూరికి మళ్లీ దెబ్బెసిన వర్ధన్నపేట..!

అరూరికి దెబ్బెసిన వర్ధన్నపేట..
అండగా నిలుస్తున్న పశ్చిమ,తూర్పు..
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: వరంగల్ బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ కు వర్ధన్నపేట నియోజకవర్గం మళ్లీ దెబ్బెసినట్లు.. కనిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో బీజేపీకి వరగల్ తూర్పు,పశ్చిమ నియోజకవర్గాలే లీడ్ ఇస్తూ వస్తున్నాయి. ఇక రెండు సార్లు భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన వర్ధన్నపేట నియోజకవర్గంలో అరూరికి ఆశించిస్థాయిలో ఓట్లు పడలేదు. ఇక్కడ అసెంబ్లీ ఫలితాలే మళ్లీ రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. వర్ధన్నపేట నియోజకవర్గ ఓటర్లు మళ్లీ అరూరిని అంగీకరించలేదనే విషయం ఓట్లు చూస్తుంటే తెలిసిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీచిందని, ఎంపీ ఎన్నికల్లో తప్పకుండా తనను ఆదరిస్తారని అరూరి అనుకున్నా.. ఓటర్లు మాత్రం ఆశించిన స్థాయిలో  ఓట్లు వేయలేదు.

పాలకుర్తిలో అంతంతే..
పాలకుర్తి నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం ఏ మాత్రం కనిపించడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మళ్లీ అదే స్థాయిలో ఓట్లు రాబట్టడంలో సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ బీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు రాబట్టడంలో విఫలమయ్యారు. ఇక బీజేపీ అయితే ఇక్కడ ఓటర్లను ఆకర్శించడంలో ఘోరంగా విఫలమైనట్లు ఫలితాలను చూస్తే తెలుస్తోంది.
భూపాలపల్లిలో..
భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ దూకుడు మళ్లీ కనిపిస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర సత్యనారాయణ తన హవా ఏ మాత్రం తగ్గకుండా.. ఓట్లు రాబడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కు ఇక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి.
పరకాలలో..
పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు హోరాహోరీగా ఓట్లు రాబడుతున్నాయి.
స్టేషన్ ఘన్ పూర్..
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్.. మెజార్టీ ఓట్లు సాధిస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి పార్టీ మారడం, కాంగ్రెస్ నుంచి కూతురు టికెట్ తెచ్చుకోవడంతో.. భారీగా వ్యతిరేక ఓటు పడుతుందని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీహరి, కవ్యను ఆదరించారు. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ కు పోటీనివ్వలేకపోతున్నాయి.
పశ్చిమ, తూర్పే..
బీజేపీకి ఇప్పటి వరకు లీడ్ ఇస్తున్న నియోజకవర్గాలు ఏవైనా ఉన్నాయంటే.. అవి వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలే. ముందు నుంచి అనుకున్నట్లుగానే అర్బన్ ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ కనిపిస్తోంది. వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని కొన్ని సార్లు చర్చ జరిగినా.. ఫలితాల్లో మాత్రం.. ఆ పార్టీ ఎదురీదుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments