స్పాట్ వాయిస్, బ్యూరో: మహబూబాబాద్ లోక్ సభ స్థానంలో మొదటి రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత ఏ మాత్రం పోటీనివ్వడం లేదు. రౌండ్ రౌండ్ కు కాంగ్రెస్ పార్టీ భారీగా ఓట్లు సాధిస్తుండడంతో నిరాశ చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత.. కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఇక్కడే కాదు.. ఖమ్మంలో సైతం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వర్ కౌంటింగ్ కేంద్రం నుంచి మొదటి రౌండ్ ఫలితాన్ని చూసే వెళ్లిపోయారు. ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఎక్కడా కూడా పోటీ నివ్వకపోవడంతో.. ఆ పార్టీ అభ్యర్థులు వరుసగా ఇంటికి వెళ్లిపోతున్నారు.
కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థులు
RELATED ARTICLES
Recent Comments