ప్రధాని మోడీనే ప్రధాన ఆకర్షణగా జరిగిన ఎన్నికల్లో ఊహించని ఘటన నెలకొంది. ఎన్నికల ఫలితాల్లో ప్రధాని నరేంద్ర మోడీ వెనుకంజలో ఉన్నారు. వారణాసి నుంచి ఆయన లోక్‌సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ .. ముందంజలో ఉన్నారు. 11480 ఓట్ల తేడాతో అజయ్ రాయ్ లీడింగ్‌లో ఉన్నారు. రెండో స్థానంలో ప్రస్తుతం ప్రధాని మోడీ ఉన్నారు. ఎన్నికల సంఘం వెబ్సైట్ ప్రకారం ఆయనకు 5257 ఓట్లు పోలయ్యాయి. దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎన్డీఏ కూటమి 290 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇండియా కూటమి 212 స్థానాల్లో పోటీ పడుతోంది.
Recent Comments