Sunday, November 24, 2024
Homeజనరల్ న్యూస్బంగాళాఖాతంలో అల్పపీడనం..

బంగాళాఖాతంలో అల్పపీడనం..

బంగాళాఖాతంలో అల్పపీడనం..
స్పాట్ వాయిస్, బ్యూరో: నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనున్నది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం విస్తరించింది. గురువారం ఉదయం నుంచి మధ్య బంగాళాఖాతంలో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నది. శుక్రవారం వరకు సముద్రం పరిస్థితి కూడా చాలా ఉధృతంగా ఉండే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. శనివారం రాత్రి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరం దాటుతుందని, తుఫానుగా మారి ఒడిశాతీరం దిశగా పయనించే అవకాశం కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments