Monday, November 25, 2024
Homeక్రైమ్లైంగికదాడి.. హత్య..

లైంగికదాడి.. హత్య..

లైంగికదాడి.. హత్య..

అడవిలోకి తీసుకెళ్లి దారుణం..

పక్కా ప్లాన్ తో అంగన్ వాడీ టీచర్ మర్డర్

మర్డర్ మిస్టరీ ఛేదించిన పోలీసులు

ఇద్దరు నిందితుల అరెస్టు..

స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ అడవిలో జరిగిన అంగన్ వాడీ టీచర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అంగన్ వాడీ టీచర్ పై లైంగికదాడి చేసి ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులను ఇద్దరిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అరెస్ట్ అయిన నిందితుల నుంచి బైక్, మూడు తులాల బంగారం గొలుసు, పుస్తెలు, వృద్ధురాలు హ్యాండ్ బాగ్, అందులో ఉన్న బ్యాంక్ పాస్ బుక్స్, ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటారం అడవిలో ఈనెల 14న అంగన్వాడీ టీచర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యపై ములుగు డీఎస్పీ శుక్రవారం వివరాలను వెల్లడించారు. ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన అంగన్ వాడీ టీచర్ తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామంలో పనిచేస్తున్నారు. ఈనెల 14న కాటాపూర్ గ్రామంలో విధులను ముగించుకున్న ఆమె చిన్నబోయినపల్లి గ్రామానికి వెళ్లేందుకు బయలుదేరారు. గ్రామంలో బస్సు మిస్ అవ్వడంతో అంతకుముందే పరిచయం ఉన్న ఆకుదారి రామయ్య తాను లిఫ్ట్ ఇస్తానని కాటాపూర్ గ్రామంలో ఆమెను బైకు ఎక్కించుకున్నాడు. అప్పటికే ఆకుదారి రామయ్య కాటాపూర్ సమీపంలోని అడవి వద్ద గల నీళ్ల ఒర్రె వద్ద పగిడి జంపయ్య అనే వ్యక్తిని బైక్ పై దించాడు. కాటాపూర్ నుంచి అంగన్ వాడీ టీచర్ తో బైకు పై బయలుదేరిన ఆకుదారి రామయ్య అడవిలో నీళ్ల ఒర్రె వద్దకు ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ ఆకుదారి రామయ్య, పగిడి జంపయ్య ఇద్దరు కలిసి ఆమెను అడవిలో కొద్ది దూరం తీసుకెళ్లారు. ఆమెపై లైంగికదాడి చేసి తర్వాత మెడలో ఉన్న బంగారం గోపితాడును లాక్కునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించారు. ఆమె తలపై రాయితో కొట్టాడు. తర్వాత ఆ రాయిని నీళ్ల ఒర్రెలో పడేశాడు. ఆకుదారి రామయ్య ఆమె చాతిపై కూర్చుని గొంతు నొక్కాడు. తర్వాత ఇద్దరు కలిసి ఆమె స్కార్ఫ్ తో మెడ చుట్టూ ఇద్దరు కలిసి లాగి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. తర్వాత ఆమె మెడలోని మూడు తులాల బంగారం గొలుసు, పుస్తెలను తీసుకున్నారు. ఆమె మొబైల్ ఫోన్ ని పక్కనే ఉన్న నీళ్ల ఒర్రెలో పడేశారు. ఆమె బ్యాగుని కూడా అడవిలో దూరంగా విసిరేశారు. తర్వాత ఆకుదారి రామయ్య, పగిడి జంపయ్యలు తమ స్వగ్రామమైన ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరు వెళ్లారు. మృతురాలి కొడుకు రడం చరణ్ ఫిర్యాదు మేరకు తాడ్వాయి పోలీసులు విచారణ చేపట్టారు. పస్రా ఇన్ స్పెక్టర్ వంగపల్లి శంకర్, తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డిల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సీసీ ఫుటేజీల, నిందితుల కాల్ డేటా ఆధారంగా పూర్తి ఆధారాలు సేకరించారు. శుక్రవారం నిందితులను ఇద్దరిని పట్టుకున్నారు. మర్డర్ మిస్టరీ లో ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన పస్రా సీఐ శంకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్సై చింత నారాయణ, హెడ్ కానిస్టేబుల్ కిషన్, హనుమాన్ పోలీస్ కానిస్టేబుళ్లు పూజారి రమేష్, జాజ సాంబయ్య, అప్పాల రమేష్, గోపు రాజీవ్, కాసగోని రాజేష్ లను ములుగు డీఎస్పీ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments