రెండు వారాలు మూతపడనున్న థియేటర్లు..
స్పాట్ వాయిస్, డెస్క్: థియేటర్లు ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో పెద్ద సినిమాలేవి విడుదల కాలేదన్న విషయం తెలిసిందే. ఓ పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ ఉండటంతో భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు. దీంతో చిన్నా చితకా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వసాగాయి. అయితే స్టార్ హీరోల సినిమాలేవి లేకపోవడంతో ప్రేక్షకులు థియేటర్ రావడం తగ్గించారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో ప్రేక్షకులు రాకపోవడంతో థియేటర్స్ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ లో చిన్న సినిమాలు వేస్తే థియేటర్స్ కి ఎవ్వరూ రావట్లేదు. ఇక సమ్మర్ మొదలైనప్పటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భారీ నష్టాలని చూస్తున్నాయని థియేటర్ యాజమాన్యం తెలుపుతుంది. అయితే ఈ నష్టాలను పూడ్చడానికి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఓ నిర్ణయానికి వచ్చాయి. సమ్మర్ అయిపోయే వరకు ఓ రెండు వారాల పాటు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. థియేటర్స్ కి జనాలు ఎవ్వరూ రావట్లేదని కారణంతోనే థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ శుక్రవారం నుంచి ఇది అమలులోకి రానున్నట్లు ప్రకటించారు. అయితే ఇలా చేయడం వలన చిన్న సినిమాలు నష్ట పోనున్నాయి. ఈ వారం గెటప్ శ్రీను రాజు యాదవ్‌తో పాటు లవ్ మీ మరిన్ని చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ఈ సినిమాలకు థియేటర్స్ క్లోజ్ చేయడం వలన భారీ ఎఫెక్ట్ పడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
RELATED ARTICLES
Recent Comments