* సాటి సిబ్బంది వేధింపులే కారణమని ఆరోపణలు*
*ఖానాపూర్ మండలం బుధరావుపేట మోడల్ స్కూల్ లో ఘటన*
స్పాట్ వాయిస్, నర్సంపేట (ఖానాపురం) : ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఖానాపూర్ మండలం బుధరావుపేట మోడల్ స్కూల్లో బుధవారం జరిగింది. మోడల్ స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయురాలిగా గా పనిచేస్తున్న హారిక బుధవారం విధులకు హాజరైన అనంతరం పాఠశాలలో దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన సిబ్బంది ఆమెను నర్సంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు పాఠశాలలో పనిచేసే కొందరు సిబ్బంది వేధింపులే కారణమని తెలుస్తోంది.
Recent Comments