Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్సామాన్యుడికి అసమాన్య పట్టం..?!

సామాన్యుడికి అసమాన్య పట్టం..?!

సామాన్యుడికి అసమాన్య పట్టం..?!

* సీఈసీ పరిశీలనలో పెరుమాండ్ల పేరు..

* అంచెలంచెలుగా అధిష్టానం దృష్టికి…

* ఎంపీ అభ్యర్థిగా రామకృష్ణకు అవకాశం..?

* వీర విధేయతే బలం…

స్పాట్ వాయిస్, బ్యూరో: పార్టీ గొప్పతనమో.., వ్యక్తి మంచితనమో కానీ అర్హత కు గుర్తింపు ఇది. క్యాడర్ తో పార్టీకి బలమో.., పార్టీ వల్ల శ్రేణులకు ధైర్యమో గానీ ప్రతిభకు పట్టం ఇది. నమ్ముకున్న వారికి న్యాయం చేయడం…, పట్టుకుని సాగే వారిని అట్టి పెట్టుకొని ఉండడం కాంగ్రెస్ కే సాధ్యం. అందుకు ప్రత్యక్ష సాక్షమే డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ. హస్తమే సర్వస్వంగా.., చేతితోనే ప్రయాణం గా సాగిన ఆయన తీరు కు పట్టం దక్కబోతోంది. కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిశీలనలో డాక్టర్ పెరుమాండ్ల పేరు ప్రాథమికంగా చేరింది. పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవను గుర్తించి కాంగ్రెస్ అదినాయకత్వం వరంగల్ ఎం పీ టికెట్ కేటాయించే దిశ గా ఆలోచన చేస్తోంది. మరో ఇద్దరి నుండి పోటీ ఉన్నా రామకృష్ణ లాంటి నాయకుడి పేరు ఆ స్థాయి చేరడం నిజం గా గర్వ కారణమే అని అభిమానులు సంబురపడుతున్నారు. అన్నీ అనుకూలించి త్వరలో నే పెరుమాండ్ల పేరు ఫైనల్ అయితే నిజమైన విధేయతను పార్టీ ఎప్పుడూ కాపాడుకొని న్యాయం చేసినట్టే అవుతుందని ఆతృత్తగా చూస్తున్నారు.

చివ‌రి నిమిషంలో…

వ‌రంగ‌ల్ ఎంపీ కాంగ్రెస్‌ టికెట్ కేటాయింపు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. దీంతో ఆశావ‌హుల‌తోపాటు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అభ్యర్థి ప్రకటన కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మంగ‌ళ‌వారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ భేటీ అయింది. ఇందులో ఇటీవల బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పసునూరి దయాకర్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, దొమ్మాటి సాంబయ్య పేర్లు పరిశీలనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

 

పెరుమాండ్ల వైపే అధిష్టానం మొగ్గు ..

ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ ఎస్ ఎంపీ పసునూరి టికెట్ రేసులో ముందు ఉండగాఇటీవలే పార్టీలో చేరిన వ్యక్తికి ఇవ్వడంపై అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది. ఇక రెండో స్థానంలో ఉన్న డాక్టర్  పెరుమాండ్లకు, దొమ్మాటి సాంబయ్యకు మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఫ్లాష్ సర్వేలు..

అభ్యర్థుల ఎంపిక కోసం ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు డాక్టర్   పెరుమాండ్ల పేరు టాప్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక ఆయనకు టికెట్ కన్ఫామ్ అయితే కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన వారికి గుర్తింపు దక్కినట్లే. కాగా పార్లమెంట్ నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలు కూడా పెరుమాండ్ల వంటి నాయకులకే టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments