ప్రకటించిన కేసీఆర్
స్పాట్ వాయిస్, బ్యూరో: వరంగల్ లోక్ సభ బీఆర్ ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు టికెట్ కేటాయించారు. ఈ మేరకు పార్టీ అధినేత ఆమె పేరును ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ లో వరంగల్ ఎంపీ స్థానంపై కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే నేతలంతా అరూరి రమేష్ ను అభ్యర్థిగా ప్రతిపాధించగా అతడు నో చెప్పడంతో కేసీఆర్ వరంగల్ కు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే చేవెళ్ల నియోజకవర్గం నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌కు టికెట్ కేటాయించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలకు పార్టీ ఆఫీస్ నుంచి సమాచారం అందజేశారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరో స్తానమైన మహబూబాబాద్ ఎంపీ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితకే కేటాయించారు.
వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య
RELATED ARTICLES
Recent Comments