Monday, November 25, 2024
Homeతెలంగాణకేటీఆర్ కు హై ఫీవర్.. 

కేటీఆర్ కు హై ఫీవర్.. 

కేటీఆర్ కు హై ఫీవర్.. 

డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్

స్పాట్ వాయిస్, హైదరాబాద్:భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా బిజీబిజీగా గడుపుతున్నారు. లోక్ సభ నియోజవర్గాలవారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. వారికి ఎన్నికల్లో వ్యవహరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం కామారెడ్డిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనతీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.రెండురోజుల నుంచి ఇంటివద్దే ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. మరో రెండోరోజుల్లో పూర్తిగా నయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు సమరశంఖం పూరించేందుకు కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కదనభేరి సభకు కేటీఆర్ గైర్హాజరయ్యారు.త్వరగా కోలుకొని పార్టీని లోక్ సభ ఎన్నికల్లో విజయ పథంలో నడిపించాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments