Friday, November 22, 2024
Homeరాజకీయంబీఆర్ఎస్ నేతలను చెప్పుకోలేని చోట కొట్టారు..

బీఆర్ఎస్ నేతలను చెప్పుకోలేని చోట కొట్టారు..

పరకాల ఏసీపీ సమక్షంలో అక్రమ అరెస్టులు..
చితకబాదిన ఆత్మకూరు సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్..
మెప్పుకోసం పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు
సీపీని కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా, అరూరి రమేష్..

స్పాట్ వాయిస్, ఓరుగల్లు: బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులను పోలీసులు చితకబాధడం తగదని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్ అన్నారు. తాజాగా వారు మీడియాతో మాట్లాడారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ లు ఆత్మకూరు, దామెర మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన కొంత మంది ప్రజాప్రతినిధులను, బీఆర్ఎస్ బి.ఆర్.యస్.కార్యకర్తలను దాదాపు 11 మంది వరకు తీసుకొని వేరే వేరే పోలీస్ వాహనంలో దాదాపు ఒక గంట వరకు రోడ్ల మీద ప్రభుత్వ వాహనంలో తిప్పి చివరకు 5:30 గంటల ప్రాంతంలో హన్మకొండలోని నిట్ సమీపంలోని టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నందు తీసుకెళ్లి 11 మందిని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మకూరు సబ్ ఇన్ స్పెక్టర్ ప్రసాద్ చెప్పుకోలేని చోట విచక్షణ రహితంగా కొట్టారన్నారు. ఈ ఘటన వెనక జిల్లా మంత్రి భర్త హస్తం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు.


ఏం జరిగిందంటే..?
ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ గ్రామంలో సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా 23వ తేదీన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దంపతులు దర్శనం చేసుకొని వస్తున్నారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతులు దర్శనానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే అక్కడ ఎలాంటి ఘర్షణ వాతావరణం, గొడవలు జరగలేదని ఎమ్మెల్యే కడియం, మాజీ ఎమ్మెల్యేలు చల్లా, అరూరి చెప్పారు. దీనికి పోలీసులే సాక్ష్యమన్నారు.
చితకబాదారు….
జాతర ప్రాంగణంలో గొడవ జరగకపోయినా పోలీస్ ఓవర్ యాక్షన్ చేసి ఒక ఉగ్రవాదులు, స్మగ్లర్ల కోసం చేసే ఆపరేషన్ ని తలపించేలా సాధారణ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీస్ లు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్లి పైశాచికంగా కొట్టారన్నారు. అందరిని సమానంగా చూసే పోలీస్ లు ఇలా చేయడం సమాజానికి హాని కలిగించేలా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటే అక్రమ కేసులు పెట్టి ప్రజలను కొట్టించడమేనా అని ప్రశ్నించారు. ఈ మేరకు వారంతా వరంగల్ సీపీని కలిసి సదురు ఘటన వివరాలు అందజేశారు. న్యాయం జరగకపోతే 27 న చలో ఆత్మకూరు కార్యక్రమం చేపడతామని చెప్పారు.

బాధితుల వివరాలు..
ఎండీ జాకిర్ అలీ, వైస్ ఎంపీపీ,దామెర మండలం.
రేవూరి సుధాకర్ రెడ్డి,వైస్ ఎంపీపీ ఆత్మకూర్ మండలం.
నేరెళ్ల కమలాకర్, మాజీ ఎంపీటీసీ, ముస్త్యాలపల్లి గ్రామం,
రేగుల కిషోర్,అక్కంపేట గ్రామం,ఆత్మకూరు మండలం
వేల్పుల గణేష్,పెద్దాపూర్ గ్రామం,ఆత్మకూర్ మండలం.
ఆవుల శ్రీనివాస్,అగ్రంపాడ్ గ్రామం,ఆత్మకూరు మండలం
వంచ సాంబశివ రెడ్డి,అగ్రంపాడ్ గ్రామం,ఆత్మకూరు మండలం
కూస కుమారస్వామి,మాజీ సర్పంచ్, అక్కంపేట గ్రామం,ఆత్మకూరు మండలం
కాంతాల రవీందర్ రెడ్డి, గూడెప్పాడ్ గ్రామం,ఆత్మకూర్ మండలం
కాంతాల కేశవ రెడ్డి,గూడెప్పాడ్ గ్రామం,ఆత్మకూరు మండలం

RELATED ARTICLES

Most Popular

Recent Comments