విద్యార్థులకు తప్పనున్న బ్యాగుల మోత
స్పాట్ వాయిస్, డెస్క్: విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు తగ్గిపోనుంది. ఒక్కో తరగతి పుస్తకాల బరువు 25 నుంచి 30 శాతం మేర తగ్గనున్నది. పాఠ్యపుస్తకాల ముద్రణను వినియోగించే పేపర్ మందం తగ్గడమే ఇందుకు కారణం. ఇదివరకు 90 జీఎస్ఎం (గ్రామ్స్ పర్ స్కేర్ మీటర్ ) మందం పేపర్‌ను వినియోగించగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి 70 జీఎస్ఎం మందం పేపర్‌ను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో పుస్తకాలు తేలికగా, సన్నగా మారనున్నాయి.
Recent Comments