ప్రతిభతో పతకాలు సాధించాలి
– ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
స్పాట్ వాయిస్, స్పోర్ట్స్: క్రీడాకారులు తమ ప్రతిభతో పతకాలు సాధించి జిల్లా పేరు ప్రతిష్టలు పెంచాలని పశ్చిమ ఎమ్మెల్యే రాజేంద ర్ రెడ్డి అన్నారు. రాము మిత్ర మండలి ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల క్రీడా ప్రాంగణంలో రాము స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ నేటి యువత స్మార్ట్ ఫోన్లకు, సోషల్ మీడియాకు అలవాటు పడి శారీరక శ్రమలేక తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని అలాంటివారికి క్రీడా ప్రాంగణాలే ప్రత్యామ్నాయాలని పిలుపునిచ్చారు. టోర్నమెంట్ నిర్వాహకులు జిల్లా క్రికెట్ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి మార్నేని ఉదయభాను రావు మాట్లాడుతూ.. రాము మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని క్రీడ ప్రేమికుడిగా రాము క్రీడాకారులకు తన వంతు కృషిగా సహాయ సహకారాలు అందించారని అన్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో 50 జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు రూ. 50 వేల నగదు బహుమతి రన్నరప్ జట్టుకు రూ.30 వేల నగదు బహుమతి అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లను ఎమ్మెల్యే పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఓయాసిస్ విద్య సంస్థ అధినేత పరంజ్యోతి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండీ అజిజ్ ఖాన్, రాము కుటుంబ సభ్యులు కరణ్, మనీష్, విక్రమ్ రావు, అక్షిత్, తాళ్లపెళ్లి జైపాల్, బండారి ప్రభాకర్, మట్టెడ కుమార్ సీనియర్ క్రీడాకారుడు రమణ, అఫ్జల్, ఎర్ర సుమన్, తాళ్లపెళ్లి సాగర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments