పోలీసుల అదుపులో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సభ్యులు..?
స్పాట్ వాయిస్, మహబూబాబాద్/క్రైం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మిర్యాలపెంట అడవుల్లో గురువారం రాత్రి మావోలు, పోలీసుల అలజడి అయినట్లు తెలుస్తోంది. నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన అశోక్ అన్న దళం(చంద్రన్న వర్గం) సమీప అడవుల్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా పోలీసు బాస్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ నేతృత్వంలో దళంపై రెక్కి నిర్వహించి నలుగురిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు అనుమానితులా లేక దళ సభ్యులా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్పందించి మావోయిస్టు పార్టీలు గ్రామాల్లో పోలీసుల కూంబింగ్ ఆపాలని, అరెస్టు అయిన వారిని చూపాలని నూడెమోక్రసీ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రశాంతంగా ఉన్న గిరిజన గ్రామాలు ఈ ఉదంతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిరసన
సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోక్, వరంగల్ జిల్లా కార్యదర్శి గోపి, ఇద్దరు దళసభ్యుల్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బయ్యారం సబ్ డివిజన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. వారికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేస్తూ వెంకట్రాంపురంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు నందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కామ్రేడ్ అశోక్ ఆదివాసీల అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారన్నారు. కామ్రేడ్స్ అశోక్, గోపి తదితరులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
Recent Comments