అడ్డుకున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు గోబ్యాక్ అంటూ నినాదాలు
నల్గొండలో హై టెన్షన్..
స్పాట్ వాయిస్, నల్గొండ : బీఆర్ఎస్ కేటీఆర్, హరీశ్ రావులకు ఊహించని నిరసన ఎదురైంది. నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు సాయంత్రం నిర్వహించనున్న భారీ బహిరంగసభకు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు బస్సులో వెళ్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో లంచ్ ముగించుకొని బహిరంగసభకు బయలుదేరిన బస్సులను హైదరాబాదు రోడ్డులో ఉన్న హోటల్ మనోరమ దగ్గర యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
నల్లచొక్కాలను ధరించి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక నినాదాలు చేస్తూ బస్సుపై కోడిగుడ్లతో దాడి చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు గోబ్యాక్ అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో నల్గొండ టౌన్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టి రూట్ క్లియర్ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచి సభా ప్రాంగణానికి బయలుదేరి వెళ్లారు.
Recent Comments