అనారోగ్యంతో బట్టి విక్రమార్క సోదరుడు కన్నుమూత
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు(70) అనారోగ్యంతో ఈ ఉదయం కన్నుమూశారు. హోమియోలో ఎండీ చదివిన డాక్టర్ వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గా, అడిషనల్ డైరెక్టర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత వైరాలో ఉన్న తన నివాసంలో హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. హోమియో వైద్యుడిగా ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఒక సామాజిక బాధ్యతతో ఆయన ఈ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. అయితే వెంకటేశ్వరరావు కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతుతన్న క్రమంలో మూడు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో, ఆరోగ్యం క్షీణించి ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సోదరుడి మరణంతో భట్టి విక్రమార్క మేడిగడ్డ పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన ఆయన సొంత జిల్లా ఖమ్మంకు బయలుదేరి వెళ్లారు. బట్టి స్వగ్రామం స్నానాల లక్ష్మీపురంలో ఈ సాయంత్రం 5 గంటలకు వెంకటేశ్వర్లు అంత్యక్రియలు జరగనున్నట్లు తెలిసింది. .
డిప్యూటీ సీఎం బట్టి ఇంట్లో విషాదం
RELATED ARTICLES
Recent Comments