Sunday, April 6, 2025
Homeలేటెస్ట్ న్యూస్తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో హుక్కా నిషేధం..
బిల్లు పెట్టిన కాంగ్రెస్ సర్కార్
స్పాట్ వాయిస్, బ్యూరో: నాలుగోరోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్‌ అండ్‌ అదర్‌ టొబాకో ప్రొడక్ట్స్‌ అమెండ్‌మెంట్‌ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్‌ బాబు సభలో ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చలేకుండానే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. హుక్కా సెంటర్లపై నిషేధం అవసరమని, యువత ధూమపానానికి వ్యసనమయ్యే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పొగ కంటే హుక్కా వెయ్యి రెట్టు హాని కారమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి బిల్లుతో ఇక రాష్ట్రంలో హుక్కా సెంటర్లు మూతబడనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments