కష్టపడిన వారికి సముచిత స్థానం ఉంటుంది..
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి
స్పాట్ వాయిస్, పెద్ద వంగర : ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అందరం కష్టపడి పనిచేయాలని, అలాంటి వారికి పార్టీలో తప్పక గుర్తింపు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మండల ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి రాబోయే ఎంపీ ఎన్నికలపై నాయకులకు దిశనిర్ధేశం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దవంగర మండలంలో సుమారు ఐదు వేల మెజారిటీ ఇచ్చారని, అదే ఉత్తేజంతో రాబోయే ఎన్నికల్లో ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చూడాలని, ప్రభుత్వ పని తీరును ప్రజలకు వివరించాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గం దశబ్దకాలం నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తామని, అధికారంలోకి కష్టపడి వచ్చాం ఇష్టంగా పని చేయాలని సూచించారు. నియోజకవర్గంలో భూకబ్జా అనే మాట వినపడొద్దని, అలా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కచ్చితంగా తగిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా నాయకులు వ్యవహరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, సీనియర్ నాయకులు నిరంజన్ రెడ్డి, బొబ్బాల రమణా రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకన్న, రంగు మురళి, శ్యాం, సీతారాం నాయక్, కరుణాకర్, వేణు, సతీష్, సైదులు, యూత్ అధ్యక్షుడు హరీష్, పార్టీ ముఖ్యనాయకులు, వివిధ అనుబంధ సంఘ నాయకులు తదితరులుపాల్గొన్నారు.
కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలి
RELATED ARTICLES
Recent Comments