బీఆర్ఎస్కు షాక్… నెగ్గిన అవిశ్వాసం
స్పాట్ వాయిస్, గణపురం: రాష్ట్రంలో అధికార మార్పిడితో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు జరుగుతుండగా.. తాజాగా సహకార సంఘాలపై అవిశ్వాస తీర్మానాలు మొదలయ్యాయి. గణపురంలో అదే జరిగింది. గణపురం పీఏసీఎస్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానంతో హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ పోరెడ్డి పూర్ణ చంద్రారెడ్డిపై వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సోమవారం కలెక్టర్ ఆదేశాలతో డీసీవో ఆధ్వర్యంలో పీఏసీఎస్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఓటింగ్లో కాంగ్రెస్ పార్టీకి 12 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఫలితంగా బీఆర్ఎస్ పార్టీ పీఏసీఎస్ చైర్మన్ పీఠాన్ని కోల్పోయింది.
గణపురం పీఏసీఎస్ ‘హస్త’ గతం
RELATED ARTICLES
Recent Comments