మృతులిద్దరూ బీటెక్ ఫైనల్ ఇయర్..
కేయూ పీఎస్ ఎదుట ఘటన..
చేతికొచ్చిన కుమారుల మరణంతో కుటుంబాల్లో విషాదం..
స్పాట్ వాయిస్, క్రైమ్: రోడ్డు ప్రమాదంలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మృతి చెందారు. గురువారం రాత్రి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలోని జరిగిన ప్రమాద వివరాలు ఇన్ స్పెక్టర్ అబ్బయ్య కథనం ప్రకారం ఇలా ఉన్నాయి… గురువారం రాత్రి సుమారు 11:30 గంటలకు హనుమాన్ నగర్ డబ్బాలకు చెందిన బొజ్జ విశ్వతేజ, కోమటి పల్లికి చెందిన తిప్పని సూర్యతేజ మరో మిత్రుడితో కలిసి ఓ కళాశాలకు వెళ్లి ఒకే బైక్ పై తిరుగుప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే కేయూ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద అతి వేగంగా వెళ్తున్న వీరి బైక్ డివైడర్ కు తగిలింది. దీంతో వెనక కూర్చున్న విశ్వతేజ, సూర్యతేజ కిందపడడంతో వారి తలలకు బలమైన గాయాలయ్యాయి. వారిని మిత్రులు తిరుమల్, సుధీంద్ర ఎంజీఎంకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ విశ్వతేజ మరణించాడు. సూర్యతేజను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు కూడా శ్వాస విడిచాడు. ఈ మేరకు బొజ్జ విశ్వతేజ తండ్రి చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్ స్పెక్టర్ అబ్బయ్య తెలిపారు. కాగా చేతికొచ్చిన కుమారులు అకాల మరణం చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
Recent Comments