Monday, April 14, 2025
Homeజిల్లా వార్తలువిద్యార్థులకు అల్పాహారం కోసం ఆర్థిక సాయం

విద్యార్థులకు అల్పాహారం కోసం ఆర్థిక సాయం

స్పాట్ వాయిస్, ఖమ్మం: ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం కోసం దాతలు రూ.20 వేల ఆర్థిక సాయం చేశారు. గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు మౌలానా కూతురు మాజీ ఎంపీపీ, రజియా సుల్తానా దంపతులు గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు 20 వేల నగదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాల అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు సాయంత్రం స్పెషల్ క్లాసుల్లో ఏకాగ్రతతో చదవడం కోసం ఈ ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాఫర్, సీపీఐ నాయకులు గౌస్ పాషా, రాజా గౌడ్, బూర నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments