Saturday, April 19, 2025
Homeతెలంగాణకేయూలో ఉద్రిక్తత

కేయూలో ఉద్రిక్తత

కేయూలో ఉద్రిక్తత

వీసీ చాంబర్‌లో బీఈడీ విద్యార్థుల ఆందోళన..

స్పాట్ వాయిస్, హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీలో మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం వీసీ చాంబర్‌లో బీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ బాటిల్స్ చేతబట్టి విద్యార్థులు నిరసన చేపట్టారు. విద్యాసంవత్సరం పూర్తి అయినప్పటికీ టీసీలు ఇవ్వడం లేదంటూ స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. టీసీ ఇవ్వకపోవడంతో పీజీ అడ్మిషన్స్‌కు దరఖాస్తు చేసుకోలేక పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు వారిస్తున్నారు. యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments