కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ రహదారులు, రైల్వే థర్డ్ లైన్, దేవాదుల ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ రెండో స్టేజ్ పనుల ప్రగతిని అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 163 జీ వరంగల్ నుంచి ఖమ్మం వరకు, 365 ‘ఏ కురవి నుంచి ఖమ్మం వరకు, 930 పి తొర్రూరు నుంచి బయ్యారం నెహ్రు నగర్ వరకు చేపడుతున్న జాతీయ రహదారుల పనులు, రైల్వే థర్డ్ లైన్ కోసం భూ సేకరణ, నష్టపరిహారం పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే కురవి, గార్ల మండలాల ఆర్ఓబీ పనులు నీటిపారుదల శాఖ ద్వారా పెద్ద వంగర మండలం పోచంపల్లిలో చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు, 14వ ప్యాకేజీ కింద చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం పనులు ఎస్సారెస్పీ సెకండ్ స్టేజీ పనులలో భూసేకరణ పూర్తి చేసి నష్టపరిహారం బాధితులకు అందజేయాలని సూచించారు. సమీక్ష సమావేశంలో మహబూబాబాద్, తొర్రూరు ఆర్డీవోలు అలివేలు, నరసింహారావు, రోడ్లు భవనాల శాఖ అధికారి తానేశ్వర్, జాతీయ రహదారులు అధికారి యుగంధర్, నీటిపారుదల శాఖ అధికారి వెంకన్న, కలెక్టరేట్ సెక్షన్ అధికారి ఫిరోజ్ , తదితరులు పాల్గొన్నారు.
Recent Comments