- కండక్టర్ పై మహిళ దాడి
- స్పాట్ వాయిస్, బ్యూరో : హయత్ నగర్ బస్ డిపో 1 కు చెందిన కండక్టర్ పై ఒక మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ దుర్భాష లాడుతూ దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హయత్ నగర్ నుంచి అఫ్టల్ గంజ్ రూట్ లో నడిచే 72 బస్ సర్వీస్ లో ఒక మహిళ మద్యం సేవించి ఎక్కింది. ఈ క్రమంలో చిల్లర విషయంలో విధులు నిర్వర్తిస్తున్న సదరు బస్ కండక్టర్ ను నానా బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ చేత్తో కొడుతూ కాలుతో తన్నడం జరిగింది. బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఎంత వారిం చినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది. ఈ ఘటన పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు.
కండక్టర్ పై మహిళ దాడి
RELATED ARTICLES
Recent Comments